హైదరాబాద్- గ్యాంగ్ స్టర్ నయీం కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. గత ఐదేల్లుగా నయీం కేసు విచారణ జరుగుతున్నా పెద్దగా పురోగతి కనిపించడం లేదు. నయీం ఎన్ కౌంటర్ జరిగిన కొత్తలో ఉన్న హడావుడి ఆ తరువాత చల్లబడిపోయింది. ఇప్పుడు నయీం కేసు ఏమైందో కూడా ఎవ్వరికి తెలియదు. ఇదిగో ఇటువంటి సమయంలో నయీం కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్ స్టర్ నయీం కేసులో కమిషన్ ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని […]