ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇది ఎవరికైనా సంజీవని లాంటి మాట. అధినేతలు సైతం ఇందుకు అతీతం కాదు. ఓ రాష్ట్రాన్ని ముందుకి నడపాలంటే దానికి శారీరకంగా, మానసికంగా చాలా శక్తి ఉండాలి. తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ విషయంలో మంచి అవగహన కలిగి ఉంటారు. ప్రస్తుతం ఆయన వయసు 68 సంవత్సరాలు. ఇప్పుడు కూడా ఆయన చాలా ఫిట్ గా, స్లిమ్ గా ఉంటారు. రోజు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందించడమే దీనికి కారణం. […]