కొత్తగూడెం క్రైం- సమాజంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. క్రైం రేట్ పెరిగిపోతుండటంతో సర్వత్రా ఆందోళన పెరుగుతోంది. అందులోను మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరగడం భయాందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా తెలంగాణలో మహిళా ఉపాధ్యాయురాలుపై సహచర టీచర్ దారుణానికి పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ దారుణమైన ఘటన జరిగింది. మహిళా ఉపాధ్యాయురాలిపై సహోద్యోగి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. […]