2007లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులకు బలైన ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఒకే గ్రౌండ్‌లో 100 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బ్రాడ్ ఈ రికార్డును సాధించాడు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కైల్ వెర్రెయిన్నేను అవుట్ చేయడం ద్వారా క్రికెట్ మక్కా లార్డ్స్ […]