తెలుగువాడు అయినప్పటికీ తమిళంలో స్టార్ హీరో స్థానం సంపాదించుకున్న హీరో విశాల్ ప్రస్తుతం ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనే సినిమా చేస్తున్నారు. శరవణనన్ దర్శకుడు. హీరోగా విశాల్‌కు 31వ సినిమా. ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా విశాల్‌తో పాటు పలువురు నటీనటులపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విశాల్ ఫైట్ సీన్ చేస్తుండగా బలంగా గోడను ఢీకొని కింద పడిపోయారు. ఆకస్మాత్తుగా జరిగిన పరిణామానికి చిత్ర యూనిట్ ఉలిక్కిపడింది. ఈ ప్రమాదంలో విశాల్వె […]