ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ కేన్సర్ మహమ్మారి భయపెడుతూనే ఉంది. అందుకే శరీరంలో కన్పించే కొన్ని లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదంటారు. మీ శరీరంలో ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి. ఇప్పటికీ మనిషిని భయపెట్టే కేన్సర్ చాలా రకాలుగా ఉంటుంది. అందులో లివర్ కేన్సర్ ముఖ్యమైంది. స్థూలకాయం, ఆల్కహాల్ సేవనం కారణంగా లివర్ కేన్సర్ ముప్పు పెరిగిపోతోంది. కాలేయంలోని కణజాలం అదుపులేకుండా పెరిగితే లివర్ కేన్సర్ ఉందని అర్ధం. […]