టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పట్టాభిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పట్టాభి అరెస్టుపై శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. శనివారం పిటిషనర్ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ఈ నేపథ్యంలోనే పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ప్రస్తుతం పట్టాభి రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. సీఎంపై అనుచిత […]
ఏపీలో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలతో అసలు వివాదం మొదలైంది. పట్టాభిని పోలీసులు తన నివాసంలో తలుపులు పగలగొట్టి బుధవారం రాత్రి సమయంలో అరెస్టు చేశారు. ఇదే అంశంపై స్వయంగా సీఎం జగన్ కూడా స్పందించారు. ఒక కాన్‌స్టిట్యూషనల్ హెడ్‌ని దుర్భాషలాడతారా అంటూ భావోద్వేగానికి కూడా గురయ్యారు. తన ఫేస్‌బుక్ పేజీలో అదే […]
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి చేశారు. విజయవాడలోని ఆయన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు సామగ్రి ధ్వంసం చేశారు. ఈ రోజు ఉదయం టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు పోలీసులు నోటీసులు అందించడంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళవారం ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. ఏపీ గంజాయికి అడ్డాగా మారిందని.. అలాంటి పరిస్థితి లేకుంటే తెలంగాణ , తమిళనాడు […]