సాధారణంగా స్టార్ హీరోలకే ప్రైవేట్ జెట్లు గానీ, హెలికాప్టర్ గానీ ఉంటాయి. హీరోయిన్లకు ఉండే అవకాశం అయితే తక్కువే. ఇప్పటి సంగతేమో గానీ ఒకప్పటి నటీనటులు డబ్బులు సంపాదించేవారు గానీ కూడబెట్టుకునేవారు. దీంతో వారు జీవిత ముగింపు దశలో ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ కొంతమంది జాగ్రత్త పడ్డారు. విలాసవంతమైన భవనాలు, కార్లు అన్నీ కొనుక్కున్నారు. అయితే ఒక హీరోయిన్ కి సొంతంగా హెలికాప్టర్ కూడా ఉందట.
తెలుగు ఇండస్ట్రీలో ఆ తరం హీరోయిన్లలో అంజలీ దేవి, భానుమతి, సావిత్రి, జమున లాంటి గొప్ప నటీమణులతో సమానంగా పేరు తెచ్చుకున్న నటి కేఆర్ విజయ. మద్రాస్ లో ఒక టీవీ షోలో కేఆర్ విజయని చూసిన నటుడు జెమినీ గణేషన్ నువు స్టార్ హీరోయిన్ అవుతావని ప్రోత్సహించారు. కె.ఎస్.గోపాలకృష్ణన్ దర్శకత్వం ‘కర్పగం’ అనే మూవీతో ఆమె సీనీ రంగ ప్రవేశం చేశారు. ఆ మూవీలో హీరో జెమినీ గణేష్. కేఆర్ విజయ తన అందం, అభినయంతో […]