గత కొన్ని రోజులుగా తెలంగాణలో కొనసాగుతున్న హై టెన్షన్ కి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముగింపు పలికారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ వీడుతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం ఉదయం స్పీకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాను సమర్పించారు. అంతకు ముందు తన రాజీనామా లేఖను మీడియా సమక్షంలో అందరికి చూపించారు. ఇదిలా […]
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ పేరు ప్రస్తుతం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలో హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత వారం రోజులుగా ఈ పేరే వినిపిస్తోంది. ఆయన కాంగ్రెస్ ని వీడటం, మరేదో పార్టీలో చేరడం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు, విమర్శలు చేయడం, వాటిపై తిరిగి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం.. ఇలా అప్‌డేట్స్ నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డి చేసిన పనిని […]
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే వ్యవహారంలో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అయితే ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలపై రాజగోపాల్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి.. రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. […]
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న దళితబంధు పథకాన్ని మునుగోడు నియోజకవర్గంలో కూడా అమలు చేయాలని ఆయన నిరసనకు దిగాడు. దీంతో ఆయనను ముందస్తుగానే బొంగుళూర్ గేట్ సమీపంలో ఆయనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. ముందుగా ఆయన దళిత బంధు కోసం చలో మునుగోడు కార్యక్రమాన్ని కొనసాగించేచేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అయన వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. మునుగోడుకు […]