సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు గడగడలాడించారు. 3 ఓవర్లు పూర్తి కాకముందే 9 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ.. మార్కరమ్(25), పార్నెల్(24), కేశవ్ మహరాజ్(41) పోరాటంతో సౌతాఫ్రికా వంద పరుగుల మార్క్‌ను దాటింది. నిర్ణీత […]