సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దులు, రంగవల్లులు, గొబ్బెమ్మలు ఎంత ప్రధానమో గాలిపటాలకు అంతే క్రేజ్. ఈ పండుగ సమయంలో పిల్లలు, పెద్దలు అందరూ గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంస్కృతి పెద్దగా కనిపించప్పటికీ, నగరంలో ఏ బిల్డింగ్ పైన చూసినా వీరే కనిపిస్తుంటారు. అయితే.. ఈసారి ఆ ఆనందం దూరమైనట్లే. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని, ప్రధాన కూడళ్లు, ప్రార్థనాస్థలాలు, చుట్టు పక్కల ప్రాంతాల్లో పతంగులను ఎగురవేయడాన్ని హైదరాబాద్ పోలీసులు నిషేధించారు. ఈ నిషేధం […]