ఐపీఎల్ 2026 కోసం ఫ్రాంచైజీలు అప్పుడే సన్నాహాలు ప్రారంభించేశాయి. ఇంటర్నల్ ట్రేడింగ్‌లో భాగంగా ఆటగాళ్లను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సంజూ శామ్సన్ కోసం ఇప్పుడు రెండు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. సంజూ శామ్సన్ కోసం కొత్తగా కోల్‌కతా నైట్‌రైడర్స్ బేరసారాలు మొదలెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఐపీఎల్ 2026 కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఓ మంచి కెప్టెన్ అవసరం ఉంది. అందుకే ఈ జట్టు యాజమాన్యం ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శామ్సన్‌పై కన్నేసింది. […]