టీమిండియాలో బెస్ట్ ఫినిషర్ అంటే ధోనినే. అతను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత.. ఆ లోటు అలాగే ఉండిపోయింది. కానీ.. ఉమెన్స్ టీమ్‌కు మాత్రం రిచా రూపంలో ఓ లేడీ ధోని దొరికినట్టే అనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్‌లో రిచా అద్భుతమైన ఫినిషర్‌గా టీమిండియా విజయాలు అందిస్తోంది.
ఆసియా కప్ 2022లో భారత పురుషుల జట్టు విఫలమైనా.. వుమెన్స్ టీమ్ సత్తా చాటింది. వుమెన్స్ ఆసియా కప్ 2022 ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. శనివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్లు తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఏడో సారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఘన విజయం తర్వాత టీమిండియా క్రికెటర్లు ఓ రేంజ్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. స్టార్ ప్లేయర్ జెమియా రోడ్రిగ్స్ నేలపై పడుకుని […]
ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ 2022ను సాధించడంలో భారత పురుషుల జట్టు విఫలమైనా.. వుమెన్స్ ఆసియా కప్ 2022లో భారత మహిళల జట్టు సత్తా చాటింది. శ్రీలంకతో శనివారం జరిగిన ఫైనల్‌లో భారీ విజయం సాధించింది విమెన్ ఇన్ బ్లూ. సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌పై ఒక్క పరుగు తేడాతో అద్భుత విజయం సాధించి ఫైనల్ చేరిన శ్రీలంక.. ఫైనల్లో మాత్రం భారత్ బౌలర్ల ముందు నిలువలేకపోయింది. అబ్బాయిలు సాధించినట్లు ఆసియా కప్‌ను తాము కూడా సాధించాలని ఆశపడ్డ […]
టీమిండియా స్టార్ ఫినిషర్ దినేష్ కార్తీక్ డెత్ ఓవర్స్‌లో ఎంతటి విధ్వంసం సృష్టించగలడో మనకు తెలిసిందే. కెరీర్ ఆరంభంలో మిడిల్డార్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్‌గా ఉన్న డీకే.. తర్వాత ఫినిషర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం టీమిండియాలో డీకే ఒక సెన్సేషన్. టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియాకు తురుపుమొక్కగా ఉన్నాడు. కాగా.. దినేష్ కార్తీక్ బ్యాట్ నుంచి వచ్చే షాట్లు ఎంత అద్భుతంగా ఉంటాయో వర్ణించడం కష్టం. ఒకదానికి మించి మరొకటి ఉంటాయి. వాటిల్లో దిల్ స్కూప్ […]
బర్మింగ్‌హామ్ వేదికగా ఇటివల ముగిసిన కామన్వెల్త్ గ్రేమ్స్ 2022లో భారత మహిళల క్రికెట్ జట్టు సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. వారి ప్రదర్శనపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. కానీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఉమెన్స్ టీమ్ గురించి చేసిన ఒక ట్వీట్‌పై సోసల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దాదా వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా.. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్‌లో […]
చాలా కాలం తర్వాత ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన క్రీడల్లో ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్ టీమ్‌తో ఇండియన్ ఉమెన్స్ టీమ్ తలపడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. గెలుపు కోసం భారత మహిళా జట్టు ఆఖరి వరకు పోరాడినా.. ఆష్లే గార్డ్‌నర్ 52 పరుగులతో అజేయంగా నిలిచి ఆసీస్‌ను గెలిపిచింది. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో విజయంతో శుభారంభం ఇవ్వాలని భావించిన టీమిండియాకు నిరాశే ఎదురైంది. కాగా […]
పాకిస్థాన్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత్ విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మిథాలీ సేన 107 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా మ్యాచ్ గెలుపు కంటే కూడా మ్యాచ్ అనంతరం భారత అమ్మాయిలు చేసిన పనే ఇప్పుడు విశేషంగా మారింది. ఐసీసీతో పాటు అభిమానులు, మాజీ క్రికెటర్లు భారత అమ్మాయిలు చేసిన పనిపై […]
టీమిండియా ఉమెన్స్ టీమ్ స్టార్ క్రికెటర్ షఫాలీ వర్మను ఇంతవరకు మహిళల బౌలింగ్‌ను చితక్కొడుతుండగా చూశాం.. ఇప్పుడు ఈ స్టార్ ప్లేయర్ అండర్25 మేల్ క్రికెటర్ల స్పీడ్ బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఉమెన్ క్రికెట్‌లో షార్ట్ బాల్స్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు పురుషుల బౌలింగ్‌ను షఫాలీ వర్మ ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ప్రాక్టీస్‌లో కూడా షఫాలీ పురుషుల బౌలింగ్‌ను కూడా ధీటుగా ఎదుర్కొంటున్నారు. టీమిండియా ఓపెనర్‌గా దూకుడైన ఆట తీరును ప్రదర్శించే షఫాలీ.. ఈ ప్రాక్టీస్ […]