నువ్వెంతంటే నువ్వెంతనుకున్న ఇండియా అమెరికాలు ఇప్పుడు మళ్లీ మెతకబడుతున్నట్టున్నాయి. ఎవరు తగ్గారు. ఎవరు గెలిచారనేది అప్రస్తుతమే అయినా రెండు దేశాల అగ్రనేతల ట్వీట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మోదీతో మాట్లాడేందుకు ట్రంప్ సంసిద్ధత వ్యక్తం చేయగా మోదీ కూడా దీనికోసమే ఎదురు చూస్తున్నాననడం గమనార్హం. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల నేపధ్యంలో ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియా చేసే ఎగుమతులపై 50 శాతం సుంకాలు విధించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి. ట్రంప్‌తో […]