ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షసూచన జారీ అయింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడ్రోజులు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి..అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఐఎండీ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఈ నెల 22వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా రానున్న మూడ్రోజులు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలతో పాటు […]