హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకల రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజు అనే వ్యక్తిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన మరువక ముందే నగరంలో మరో ఘోరం జరిగింది. హైదరాబాద్ మియాపూర్‌లో ఓంకార్ నగర్‌లో నిన్న కనిపించకుండా పోయిన 13 నెలల చిన్నారి విగతజీవిగా కనిపించింది. ఇంటి సమీపంలోని నీటి సంపులో బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. […]