భాగ్యనగరంలో ఈ మధ్య ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ‘సన్ డే-ఫన్ డే’, ‘ఏక్ శామ్ చార్మినార్ కే నామ్’ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు నగర పురపాలక శాఖ ప్రకటించింది. ‘సన్ డే-ఫన్ డే’ అనేది ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తుండగా.. ‘ఏక్ శామ్ చార్మినార్ కే నామ్’ కార్యక్రమం పాతబస్తీలోని చార్మినార్ వద్ద నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై క్లారిటీ వచ్చేవరకు ఈ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ […]
ప్రపంచాన్ని మొన్నటి వరకు కరోనా డెల్టా వేరియంట్ భయపెట్టింది. దీని ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టిందనుకునే లోపు ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ ముప్పుతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్లను అధికారులు ట్రేస్ చేస్తున్నారు. టి నుండి విదేశాల నుంచి ముఖ్యంగా ఎట్ రిస్క్ దేశాల నుంచి వస్తున్న వారి పై […]