మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. మంచి పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది. ఇది తీసుకుంటే మీరు తక్కువ ప్రీమియంకే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.
ప్రభుత్వ రంగ సంస్థలో అతిముఖ్యమైన వాటిల్లో తపాల వ్యవస్థ ఒకటి. ఒకప్పుడు సమాచారాన్ని చేరవేయడంలో కీలక పాత్ర పోషించేది. మారుతున్న కాలంతో పాటు పోస్టాఫీసు తన సేవలను మార్చుకుంటూ వచ్చింది. బ్యాంకులకు ధీటుగా తన సేవలను వినియోగదారులకు అందిస్తూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలో పోస్టాఫీసు.. వినియోదారులను పెంచుకునేందుకు, తమ కస్టమర్ల కోసం అనేక కొత్త పథకాలను తీసుకవస్తోంది. అనేక రకాల పథకాలతో పోస్టాఫీసు తమ వినియోదారులకు మంచి లాభాలను అందిస్తోంది. అలాంటి పథకాల్లో “గ్రామ సుమంగళ్ రూరల్ […]