ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ కాలిమంటన్ ప్రావిన్స్ పరిధిలో అడవికి అంటుకున్న కార్చిచ్చును ఆర్పేందుకు నదిలో నీటిని తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు అదే నదిలో హెలీకాప్టర్ కుప్పకూలింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ముగ్గురు సిబ్బందిని కాపాడారు. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారుతోంది. ఇండోనేషియాలోని దక్షిణ కాలిమంటన్ ప్రావిన్స్ పరిధిలోని బరిటో క్వాలా రీజెన్సీ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా భీకరమైన కార్చిచ్చు చెలరేగింది. ఎండిపోయిన అడవులు, విపరీతమైన గాలుల కారణంగా మంటలు […]