హైదరాబాద్ నగరంలో ఉగ్రదాడి కలకలం రేగింది. నగరంలో ముంబై 26/11 తరహాలో మళ్లీ ఉగ్రదాడులకు పాల్పడతామంటూ గుర్తుతెలియని ఆగంతకులు ఓ బెదిరింపు ఈ-మెయిల్ పంపారు. ముఖ్యంగా రద్దీగా ఉండే కాచిగూడ రైల్వే స్టేషన్, కాచిగూడ టూరిస్ట్ ప్లాజాలను లక్ష్యంగా చేసుకుని బాంబులతో పేల్చేస్తామని ఆ మెయిల్లో హెచ్చరించారు. ఈ దాడుల్లో కనీసం 300 మందిని చంపడమే తమ లక్ష్యమని ఆగంతకులు చెప్పడం తీవ్ర సంచలనం సృష్టించింది.లతీఫ్ భట్, అతని ఇతర సహచరులను హతమార్చినందుకు ప్రతీకారంగానే ఈ దాడులకు […]