విశాఖపట్నం- తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు. కరోనాతో బాధపడుతున్న సబ్బం హరి పరిస్థితి విషమించడంతో కాసేపటిక్రితం తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి కరోనా సోకడంతో ముందు ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆ తరువాత ఆయన విశాఖపట్నం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తూవస్తున్నారు. ఈ ఉదయం నుంచే […]