కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే వారికి ఈసీ కీలక మార్పు చేసింది. ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ’ పూర్తయిన కొత్త ఓటర్లు.. ఇక తల్లిదండ్రులు, తాతలు, నానమ్మల ఓటరు జాబితా వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు ఫారం-6లో మార్పులు చేసింది.ఇప్పటివరకు కొత్త ఓటరు పేరు ఓటర్ల జాబితాలో చేర్చేందుకు సాధారణ ఫారం-6 సరిపోయేది. అయితే ‘సర్’ ప్రక్రియ సమయంలో ఫారం-6తో పాటు అదనపు డిక్లరేషన్ తీసుకున్నారు. గతంలో ఉన్న ఓటర్ల జాబితాతో తమ […]