సాధారణంగా గర్భిణీ మహిళలకు సీమంత వేడుక నిర్వహిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఆవు వంటి మూగ జీవాలకు కూడా ఈ వేడుక నిర్వహిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి గాడిద వచ్చి చేరింది. ఓ ప్రాంతంలోని గ్రామస్తులు గర్భం దాల్చిన గాడిదలకు సీమంతం, గాడిద పిల్లలకు బారసాల చేస్తున్నారు. అయితే అందుకో కారణం ఉంది.
తల్లిదండ్రులు కొడుకు చదువు మానేసి జులాయిగా తిరుగుతుంటే ఇలా తిరిగితే బాగుపడవని, గాడిదలు కాచిన పనికి రావు అంటూ తిడుతుంటారు. కానీ అదే గాడిదలు కాచిన వ్యక్తి ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు. అవును.. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం. అది కర్ణాటకలోని మంగళూరు ప్రాంతం. శ్రీనివాస్ గౌడ అనే వ్యక్తి గతంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా బలంగా నిలదొక్కుకున్నాడు. కానీ […]