హెడీ లామర్!.. ఒకప్పుడు వెండితెరను ఏలిన నటీమణి. రంగుల ప్రపంచంలో బిజీగా ఉన్న ఒక కళాకారిణి పరిశోధనల వైపు మొగ్గు చూపడం కాస్త ఆశ్చర్యంగా కనిపిస్తుంది. కానీ ఆమె ఆవిష్కరణలు చూస్తే మాత్రం తన సమయాన్నంతా పరిశోధనలకే వినియోగించి ఉంటే ఆమె మానవాళికి ఉపయోగపడే మరెన్ని ఆవిష్కరణలు సాధించేవారో కదా అనిపిస్తుంది. వియన్నాలో పుట్టిన ఈమె ఇవా మారియా అనే పేరుతో పెరిగి ‘ఎక్‌స్టసీ’ అనే చిత్రం ద్వారా ప్రపంచానికి పరిచయమైంది. ఆ తర్వాత లూయి మేయెర్ […]