నగరాల్లో చాలా మంది యువత ఉద్యోగ వేటలో పడి తగిన ఉద్యోగం దొరక్కపోయేసరికి ఫుడ్ డెలివరీ బాయ్స్ గా బైక్ ట్యాక్సీ డ్రైవర్లుగా మారి ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ డెలివరీ బాయ్స్ అతి ప్రవర్తనల వల్ల కస్టమర్లు ఇబ్బందులు పడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కస్టమర్లతో దురుసుగా మాట్లాడటం, ఫుడ్ ఆర్డర్ చేస్తే దానిని తీసుకు వచ్చే సమయంలో మధ్యలోనే తినేయడం వంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అలా అని అందరినీ తప్పు పట్టలేము. ఇక్కడ కూడా ఓ సంస్థకు చెందిన ఫుడ్ డెలివరీ బాయ్ కస్టమర్ కు ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చి ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలను ప్రమాదవశాత్తు పగలగొట్టాడు. ఆ తరువాత ఆ ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన పనికి అందరు ఆశ్యర్యపోయారు.