దేశ రాజధాని ఢిల్లీ వరద గుప్పిట్లో చిక్కుకుంది. యమునా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చొచ్చుకొచ్చేసింది. స్కూళ్లు, ఆఫీసులు మూతపడ్డాయి. యమునా నది వరద ఉధృతి వివరాలు ఇలా ఉన్నాయి. యమునా నది పోటెత్తుతోంది. ప్రమాదకరస్థాయి దాటి ప్రవహిస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్ని వరదు ముంచెత్తింది. రహదారులు వాగులుగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలైతే పూర్తిగా జలమయమవడంతో జనజీవనం స్థంబించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని సురక్షిత […]