గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జవాద్ తుఫానుగా ఏర్పడిన సంగతి తెలిసిందే. జవాద్ తుపాను కారణంగా విశాఖలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆర్కే బీచ్ లో సముద్రం ముందుకొచ్చింది. దుర్గాలమ్మ ఆలయం వరకు 200 మీటర్లు భూమి కోతకు గురైంది. పలు చోట్ల భూమి కుంగిపోయింది. దీంతో సమీపంలోని పిల్లల పార్కు ప్రహరీ గోడ కూలిపోయింది. బల్లలు విరిగాయి.. అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో పార్కుకు […]