స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ లో ఎవరిని ఉంచాలీ.. ఎవరిని తీయాలీ అని ఓ వైపు టీమిండియా మల్లగుల్లాలు పడుతుంటే.. ఆస్ట్రేలియా మాత్రం రెండు నెలల ముందే జట్టును ప్రకటించేసింది.
టీ20 క్రికెట్‌లో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్న బీసీసీఐ.. సీనియర్లకు పొమ్మనలేక పొగబెట్టినట్లు కనిపిస్తోంది. దీంతో సీనియర్ ప్లేయర్లు రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికే యోచనలో ఉన్నట్లు సమాచారం.