ఎప్పుడెప్పుడా అని ఏళ్ల తరబడి కొత్త పింఛన్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీపావళి వేళ శుభవార్త అందించారు. దీపావళి పండుగ సంతోషాల వేళ.. సరిగ్గా తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేట్‌లో మహిళా సంఘాలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసి వారి మొహాల్లో చిరునవ్వులు పూయించారు. గత ప్రభుత్వ హయాంలో […]