ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేయడం అనేది మామూలే. తనిఖీలు చేసినప్పుడు వాహనదారులు పోలీసులకు సహకరించాలి. అంతేగానీ అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే పెద్ద కేసే అవుతుంది. ఒక యువకుడ్ని ట్రాఫిక్ పోలీస్ ఆపినందుకు అతన్ని కారు బానెట్ పై ఎక్కించుకుని 20 కిలోమీటర్లు లాక్కెళ్లాడు.
దేశంలో ఏక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మనిషి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాడా? రాడా అన్నభయం పట్టుకుంది. కొంత మంది డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు.