నటసింహ నందమూరి బాలకృష్ణ 60+వయసులోనూ 30+ఉత్సాహంతో పని చేస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు, క్యాన్సర్ హాస్పిటల్ వ్యవహారాలు, టాక్ షో, ప్రకటనలు.. ఇలా ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో బాలకృష్ణకు ఉండే క్రేజే వేరు. ఆయన సినిమా కోసం ఎంత మంది ఎదురు చూస్తే.. అప్ డేట్ కోసం కూడా అంతే ఆత్రుత కనబరుస్తారు అభిమానులు. అలాగే ఇటీవల కాలంలో సక్సెస్ బాటలో పరుగెడుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి
అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తర్వాత వస్తున్న మాస్ యాక్షన్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి టీజర్ విడుదలైంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.