'ఈ ఐటమ్స్ తింటే రూ.లక్ష మీవే..!' అంటాడేంటి అని ఆశ్చర్యపోతున్నారా..? ఇది వాస్తవం. మీరు చేయాల్సిందల్లా.. కూర్చొని కడుపుబ్బా తినడమే. దీనికోసం ఎక్కడికో పోవట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో 20కి పైగా బ్రాంచులున్నాయి. ఎక్కడికైనా వెళ్లొచ్చు.. తినొచ్చు.. లక్ష గెలవచ్చు. ఎలా..? ఏంటి ఈ పోటీ..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా భారతీయ వంటకాలకు ఎంత గొప్ప పేరుందో అందరికి తెలిసిందే. భోజన ప్రియులు ఎవరైనా సరే ఇండియాలో ఒకటి రెండు రుచులతో సరిపెట్టుకోరు. ఇండియాలోని ఏ రాష్ట్రంలోనైనా వంటకాలకు వంకపెట్టే అవసరమే లేదు. ముఖ్యంగా సౌత్ లోని ఆంధ్రా వంటకాలకు ప్రత్యేకమైన పేరుంది. తెలుగు రాష్ట్రాలలోని ఏ ఇంట్లో అయినా కూర, పప్పుతో పాటు ఇతర పచ్చళ్లు కూడా ఉంటాయి. అదే తెలుగు రాష్ట్రాల ఫంక్షన్లు, పండుగలలో వంటకాలను చూస్తే ఆహా అనాల్సిందే. ఎందుకంటే సాంప్రదాయ వంటలతో […]