బెంగళూరు- కర్ణాటక ప్రభుత్వం కీలక చట్టాన్ని తీసుకువస్తోంది. దీంతో ఇకపై కర్ణాటక రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడి చట్టరిత్యా నేరం. ఈ మేరకు బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం మతమార్పిడి నిరోధక బిల్లు 2021ని సోమవారం ఆమోదించింది. కర్ణాటక మంత్రివర్గ ఆమోదం పొందిన ఈ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కర్ణాటకలో మతమార్పిడి నిరోధక బిల్లు ఉత్తర్ ప్రదేశ్ లో మతమార్పిడి చట్టన్ని అనుసరించి రూపొందించారు. ఈ నూతన చట్టం మత మార్పిడిని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తుంది. […]