1897 నుంచే బ్రిటీషర్లకు నిద్రలేకుండా చేసిన ఆదివాసీ నాయకుడు బిర్సా ముండా గురించి నేటి యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మాభిమానం కోసం, గిరిజనుల హక్కుల కోసం, స్వతంత్రం కోసం మన్యం వీరుడు సాగించిన ఉద్యమం గురించి తెలుసుకొని తీరాలి. జార్ఘండ్‌లోని ఖుంతీ జిల్లా, ఉలిహతు గ్రామంలో 1875 నవంబర్ 15 గురువారం నాడు బిర్సా ముండా జన్మించారు. బిర్సా తండ్రి సుగుణా ముండా, తల్లి కర్మి హాటు. బిర్సా అహుబటు గ్రామంలో తన మామయ్య ఇంట్లో […]