ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ భారతీయులకు షాక్ ఇచ్చింది. ఏకంగా 23 లక్షల అకౌంట్లు బ్యాన్ చేసింది. ఈ విషయాన్ని అక్టోబర్ నెలకు సంబంధించిన నివేదికలో వెల్లడించింది వాట్సాప్. ఈ అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు మొత్తంగా 23,24,000 భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది. ఇందులో మళ్లీ 8,11,000 వాట్సాప్ ఖాతాలను వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందుకోకముందే.. ముందుజాగ్రత్తగా తామే తొలగించినట్లు ఈ సందర్భంగా వాట్సాప్ వెల్లడించింది. […]