అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా సంపాదించిన సొమ్మును వైన్స్లో పెట్టుబడులుగా పెట్టారు. షేర్ మార్కెట్లో పెట్టారు. ఆస్తులు, బంగారం కొన్నారు. ఇదీ మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణి తీరు. ఇటీవల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డ వాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆమెకు రూ.6.76 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. అయితే ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ […]