ఇండోనేషియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చాక్లెట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలుముకుని ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 24 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. మరో 30 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. గల్లంతైన వారి ఆచూకి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఘోర అగ్నిప్రమాదం ఇండోనేసియా రాజధాని జకార్తాకు సమీపంలో ఉన్న చికాండే ప్రాంతంలోని ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో జరిగింది. […]