భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన అద్భుతమైన ప్రయోగాలతో వెండితెరపై వింతలు సృష్టించిన సెల్యులాయిడ్ సైంటిస్ట్, లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త యావత్ భారత సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర విషాద సమయంపై టాలీవుడ్‌కు చెందిన పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. […]