తెలుగులో బాగా పాపులారిటీ దక్కించుకున్న రియాలిటీ షోలలో.. బిగ్ బాస్ ముందు వరుసలోనే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ షో సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ లోకి వెళ్లే సభ్యుల విషయం పక్కన పెడితే.. సభ్యుల రాకతో బిగ్ బాస్ మాత్రం బాగానే సొమ్ము చేసుకుంటున్నాడని జనాలు మాట్లాడుకుంటున్నారు. జనాలు అలా అనుకోడానికి కూడా కారణాలు లేకపోలేదు. ఇటీవలే VJ సన్నీ ట్రోఫీ అందుకోవడంతో బిగ్ బాస్ 5వ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. షో అయితే ముగిసింది.. కానీ షో ద్వారా మొదలైన వివాదాలు మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా రెండు జంటల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని అంటున్నారు నెటిజన్లు. బిగ్ బాస్ లో చివరిదాకా స్థానాన్ని కాపాడుకున్న వారిలో సిరి, షణ్ముఖ్ ఉన్నారు.
అయితే.. ఇద్దరూ బిగ్ బాస్ లో ఉన్నట్లే గానీ చివరివరకు రొమాన్స్ తో వివాదాల్లో ఇరుక్కున్నారు. ఓ రకంగా సిరి మాయలోపడి షణ్ముఖ్ బాగ్ బాస్ టైటిల్ కోల్పోయాడని.. మరి సిరి హగ్స్ – రొమాన్స్ అన్నప్పుడు షణ్ముఖ్ అయినా ‘నో’ చెప్పాల్సింది కదా! అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ లోకి వెళ్లకముందే వ్యక్తిగతంగా వీరిద్దరూ రిలేషన్ షిప్స్ లో ఉన్నారు. సిరికి శ్రీహాన్ అనే బాయ్ ఫ్రెండ్ ఉండగా.. షన్నుకి దీప్తి సునైనా ఉందనే సంగతి తెలిసిందే. నిజానికి వీరిద్దరూ హౌస్ లో ఎంత రచ్చ చేసినా.. బయట ఫ్యాన్స్ ఓట్లేసి ఫినాలే వరకు రావడానికి కష్టపడింది మాత్రం శ్రీహాన్, దీప్తినే. ఫినాలే వరకు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. చివరికి బిగ్ బాస్ ట్రోఫీ సన్నీ పట్టుకెళ్లిపోయాడు.ఇదంతా పక్కనపెడితే.. ప్రస్తుతం వీరి ఇంస్టాగ్రామ్ ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. సిరి ఫాలోయర్స్ లో శ్రీహాన్ లేడు. షణ్ముఖ్ ఫాలోయర్స్ లో దీప్తి లేదు. ఇదంతా చూస్తుంటే బిగ్ బాస్ సక్సెస్ అయ్యాడు కానీ రెండు ప్రేమ జంటలు ఫసక్ అయ్యాయని ఈజీగా అర్దమవుతుంది. తాజాగా దీప్తి స్టేటస్ చూస్తే.. ‘నీకు నువ్వైనా నిజాయితీగా ఉండు’ అని పెట్టింది. మొన్నటివరకు షన్నుకి సపోర్ట్ గా పెట్టిన పోస్టులు ఎందుకు తీసేసింది..? సరే ఆ విషయం అటుంచితే.. ఎందుకని సిరి ఊరేగింపులో శ్రీహాన్ కనిపించలేదు..? అలాగే సిరి బయటికి వచ్చాక ఇంతవరకు శ్రీహాన్ ఆమెను ఎందుకు కలవలేదు? అనే ప్రశ్నలకు సమాధానం.. బిగ్ బాస్ లో సిరి – షణ్ముఖ్ రొమాన్స్ మాత్రమే అనే కారణాలు వెల్లువెత్తుతున్నాయి.
మరి బిగ్ బాస్ లో ఇద్దరి సభ్యుల మధ్య ఇంత రచ్చ జరుగుతున్నా.. అటు హోస్ట్, ఇటు బిగ్ బాస్ ఎందుకు కామ్ గా షోని రన్ చేశారు..? చివరిగా బిగ్ బాస్ అదిరిపోయే టిఆర్పీ రేటింగ్ తో మరింత పాపులర్ అయిపోయింది. కానీ నాలుగు లవ్ బర్డ్స్ జీవితాలు మాత్రం ప్రశ్నార్థకంగా మారాయి. చూడాలి మరి ఏం జరగనుందో..! మరి సిరి – షణ్ముఖ్ లవ్ లైఫ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.