చాలా మంది పిల్లలు ఎక్కువగా ఇంట్లో చేసిన ఫుడ్ కంటే బయటి ఫుడ్ నే ఎక్కువగా ఇష్టపడతారు. చిప్స్ ప్యాకెట్లు, చాక్లెట్లు, పీజ్జా, బర్గర్ వంటి వాటి పట్ల బాగా ఆకర్షితులవుతారు. పిల్లలు ఇలా ఆకర్షితులవ్వడం వెనుక ఆయా మల్టీనేషనల్ కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. ఈ బడా కంపెనీలన్నీ పోషకాలు తక్కువగా ఉండే ప్రాసెసెడ్ ఫుడ్ ని విక్రయిస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మార్కెటింగ్, మీడియా ప్రచారం, అంతర్జాతీయ ఆహార పదార్థాలు, పానీయాలు ఇష్టపడే పిల్లలకు మధ్య ఉన్న లింక్ ని పరిశోధకులు ఇన్వెస్టిగేట్ చేశారు. ఇండియా, నైజీరియా, రష్యా, బ్రెజిల్, చైనా, పాకిస్తాన్ దేశాల్లో ఉన్న పిల్లల మీద పరిశోధనలు చేశారు. ఈ దేశాలకు చెందిన మొత్తం 2,422 మంది ఐదారేళ్ళ వయసున్న పిల్లలపై పరిశోధనలు చేశారు.
పిల్లలకు స్థానిక బ్రాండ్లు, అలానే అంతర్జాతీయ బ్రాండ్లకు సంబంధించిన చిత్రాలను, వాటి తాలూకు క్యారెక్టర్స్ ని, అలానే మీడియా క్యారెక్టర్స్ ని చూపించారు. చూపించినప్పుడు 60 శాతం మంది పిల్లలు సోడా గ్లాసుని చూసి కోకాకోలా అని పేరు చెప్పారు. వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ ని ఎంత ఇష్టపడతారో.. ఎందుకు ఇష్టపడతారో పరిశోధకులు వెల్లడించారు. పిల్లలు స్థానిక ఆహార పదార్థాల కంటే కూడా ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులనే ఎక్కువగా ఎంచుకోవడానికి కారణం క్యారెక్టర్ అండ్ లోగో. స్థానికంగా దొరికే గొట్టాలు, చిప్స్ వంటివి నార్మల్ కవర్ లో ప్యాక్ చేయబడి ఉంటాయి. వీటి మీద లోగోలు ఉండవు. కాబట్టి గుర్తుపట్టే వీలు ఉండదు. అదే ప్రముఖ బ్రాండ్లు అయితే ఆకర్షణీయమైన రంగులతో.. పలు డిజైన్స్ తో. పెద్ద లోగోతో కూడిన కవర్ లో పెట్టి ప్యాక్ చేస్తాయి.
దీని వల్ల ఆ కంపెనీ లోగో పిల్లల్లో నాటుకుపోతుంది. మీడియా వాళ్ళు ప్రచారం చేసిన దాని కంటే అత్యంత ఎక్కువగా లోగో ద్వారా ఆ ఫుడ్ అనేది పిల్లల మెదడుల్లో నాటుకుపోతుంది. కేఎఫ్సీ, మెక్ డొనాల్డ్స్ వంటి ఫుడ్ కంపెనీలైనా, శీతల పానీయాలు చేసే కోకా-కోలా అయినా ఎక్కువగా ప్రాచుర్యం పొందడానికి కారణం లోగో డిజైన్. లోగో అనేది పిల్లల మీద అత్యంత ప్రభావం చూపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలానే ప్యాకెట్ల మీద ఉండే కార్టూన్ క్యారెక్టర్లు, బొమ్మలు కూడా పిల్లల్ని బాగా ఆకర్షిస్తాయి. ఈ మార్కెటింగ్ అనేది పిల్లల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో స్టడీస్ చెబుతున్నాయి. పిల్లల ముందు లస్సీ, కోకా-కోలా డ్రింక్ ఉంచితే.. ఆ పిల్లడు కోకా-కోలాకే ప్రాధాన్యత ఇస్తాడు. దీనికి కారణం కోకా-కోలా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ లస్సీ ఇంపాక్ట్ చేయలేకపోయింది.
అలానే ఇంట్లో అమ్మ చేసిన కూర నచ్చదు కానీ కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ నచ్చుతుంది. ఆ ఇంపాక్ట్ ఆలా పడింది పిల్లల మీద. మీడియా ప్రచారం వల్ల కూడా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రకటనల్లో వచ్చే నటులు క్రియేట్ చేసే ఇంపాక్ట్.. వెంటనే పిల్లల్ని ఆ ఐటమ్ తినాలనిపించేంతగా ప్రభావితం చేస్తుంది. ఇదంతా ఒక మైండ్ గేమ్. పిల్లల మైండ్ సెట్ ని ట్యూన్ చేసి.. లాభాలు పొందే ఆయా కంపెనీల స్ట్రాటజీ. పిల్లల ముందు లస్సీ, కోకా-కోలా డ్రింక్ ఉంచితే.. ఆ పిల్లలు కోకా-కోలాకే ప్రాధాన్యత ఇస్తారు. దీనికి కారణం కోకా-కోలా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ లస్సీ ఇంపాక్ట్ చేయలేకపోయింది. అలానే ఇంట్లో అమ్మ చేసిన కూర నచ్చదు కానీ కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ నచ్చుతుంది. ఆ ఇంపాక్ట్ అలా పడింది పిల్లల మీద.
ఇవన్నీ ప్రాసెడెడ్ ఫుడ్స్, ఆరోగ్యానికి హాని చేసేవే. అయినా గానీ తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోరు. ఈ జంక్ ఫుడ్ కంటిన్యూగా 5 రోజులు తింటే పిల్లలకు ఫోకస్ తగ్గడం, చురుగ్గా లేకపోవడం, మానసిక స్థితిపై ప్రభావం పడడం, జ్ఞాపకశక్తిని తగ్గడం వంటి సమస్యలు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. క్యాలరీలు, పోషకాలు లేనటువంటి జంక్ ఫుడ్ వల్ల బరువు పెరగడం, ఒబెసిటీ, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రాసెస్డ్ ఫుడ్ లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ అధిక వినియోగం వల్ల మెదడుకి మిశ్రమ సంకేతాలను పంపుతుంది. దీని వల్ల ఏమి తిన్నారో, ఎంత ఆకలిగా ఉన్నారో అనే అంచనా వేయడం కష్టమవుతుంది. ఫాస్ట్ ఫుడ్ వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలో హెచ్చుతగ్గులు కనబడతాయి. ఒకవేళ షుగర్ లెవల్స్ పడిపోతే ఆందోళన, అయోమయం, అలసట కలుగుతాయని స్టడీస్ చెబుతున్నాయి.
మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే.. మంచి ఫుడ్ ని పిల్లలకు అందించడమే. అలా చేయాలంటే ఆయా కంపెనీల స్ట్రాటజీనే అనుసరించాల్సి వస్తుందేమో. అంటే రంగులు, కెమికల్స్ కలపనటువంటి లస్సీ, కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం, పండ్ల జ్యూస్ లు వంటి సహజ పానీయాలు.. జంతికలు, లడ్డు, బూందీ, మిక్చర్ వంటి సాంప్రదాయమైన వంటకాలను ఆకర్షణీయంగా కనిపించేలా ప్యాక్ చేయాలేమో. స్థానిక దుకాణాల్లో కల్తీ లేని ఆహారం దొరికినా.. వాటిని మామూలు కవర్లలో ప్యాక్ చేస్తారు. కాబట్టి పిల్లలకు ఆకర్షణీయంగా కనబడవు. అదే బడా కంపెనీల మాదిరి బ్రాండ్ లోగో, ఆకర్షణీయమైన ప్యాకెట్ లో ప్యాక్ చేసి అమ్మితే బాగుంటుంది కదా. అలా చేయాలంటే.. క్వాంటిటీ కంటే క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్యాకెట్స్ లో గాలి నింపకుండా.. అదే ధరకు ఎక్కువ ఫుడ్ ఇచ్చే వారిని ప్రోత్సహిస్తే.. పిల్లలను ఆకర్షించే విధంగా ప్యాకింగ్ చేసి ఈ మల్టీనేషనల్ కంపెనీలు ఇచ్చే పోటీకి తట్టుకుని నిలబడతారు. దీనికి ప్రభుత్వాలే పూనుకుని ముందుకొస్తే బాగుంటుందేమో. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.