గబ్బిలాలు చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటాయి. ఎలుకకి రెక్కలు తగిలించినట్టు ఉంటాయి ఈ గబ్బిలాలు. సాధారణంగా ఎవరినైనా ‘గబ్బిలం మొహం నా యాలకులు’ అని తిట్టడం కోసం ఈ గబ్బిలం పేరుని వాడుకుంటారు. చిన్నప్పుడు అమ్మమ్మలు, నాన్నమ్మలు, స్నేహితులు.. గబ్బిలాలు పిల్లల్ని ఎత్తుకుపోతాయని కథలు చెప్పేవారు. అవి చూసి గబ్బిలాలు అంటే అప్పట్లో పిల్లలు నిక్కర్లు తడుపుకునేవారు. అప్పటికింకా ప్యాంట్లు అందుబాటులో లేవులెండి. ఇప్పుడు జనరేషన్ కిడ్స్ ని చూసి గబ్బిలాలే పారిపోయేలా ఉన్నారు. ఇకపోతే (మేటర్ లోకేనండోయ్) గబ్బిలం పేరు చెప్పుకుని హాలీవుడ్డోళ్లు ఏకంగా ఒక పెద్ద దుకాణమే తెరిచేసారు. అదేనండి ఫ్రాంఛైజీ.
గబ్బిలాన్ని ఇంగ్లి పీస్ లో ది బ్యాట్ అంటారు. ఆ బ్యాట్ కి, మ్యాన్ కి ఒక కప్లింగ్ తగిలిస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన హాలీవుడ్డోడికి వచ్చేసింది. వెంటనే ఒక బొమ్మ గీశాడు. ఆ తర్వాత ఆ బొమ్మని బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. బ్యాట్ మాన్, బ్యాట్ మాన్ రిటర్న్స్, బ్యాట్ మాన్ బిగిన్స్, బ్యాట్ మాన్ వర్సెస్ సూపర్ మాన్ అని ఇలా చాలా సినిమాలు చేశారు. గత ఏడాది ది బ్యాట్ మాన్ పేరుతో మళ్ళీ ఫ్రాంచైజీని రీబూట్ చేశారు. ఈ సినిమా చూస్తే హీరో గబ్బిలం కాస్ట్యూమ్ లో కనబడతాడు. పైగా రాత్రుళ్ళు మాత్రమే బయటకు వస్తాడు. అమెరికన్ కామిక్ బుక్స్ లో బ్యాట్ మాన్ అనేది ఒక సూపర్ హీరో క్యారెక్టర్. అసలు రాత్రుల్లే గబ్బిలాలు ఎందుకు ఎక్కువగా సంచరిస్తాయి? పగలు కళ్ళు సరిగా కనబడవా? రాత్రుళ్ళు అయితే కళ్ళు బాగా కనిపిస్తాయనా? లేక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా?
అసలు గబ్బిలాలకు కళ్ళే కనబడవట బోరోస్. ఈ గబ్బిలాలు కళ్ళున్నా చూపుకి నోచుకోలేదు. వాటికి పగలైనా, రాత్రైనా ఒకటే. ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది. కాంతిని గ్రహించే శక్తి ఆ కళ్ళకు లేవు. కళ్ళ మీద కాంతి పడినప్పుడే ఆ కళ్ళు లోకాన్ని చూడగలవు. కాంతి ప్రసరిస్తేనే చుట్టూ ఉన్న పరిసరాలు అన్నీ కనిపిస్తాయి. అందుకే చీకటిలో ఏదీ కనిపించదు. మనుషులకి 12 గంటలు చీకటి ఉంటే.. గబ్బిలాలకి 24 గంటలూ చీకటిగానే ఉంటుంది. అయితే గబ్బిలాలు చూడలేకపోయినప్పటికీ.. చీకటి, వెలుతురు తేడాలను గుర్తించగలవు. అంతేకాదు వస్తువుల ఆకారాలను కూడా అవి పసిగట్టగలవు. అంతకు ముందు వీసా, పాస్ పోర్ట్ లేకుండా విజిట్ చేసిన ప్రదేశాలను కూడా గుర్తుపెట్టుకోగలవు.
కళ్ళు కనబడకుండానే ఇంత పవర్ ఫుల్ గా ఉన్నాయంటే.. ఇక కళ్ళు కనబడితే ఇంకెంత శక్తివంతంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇంత శక్తి ఉన్న గబ్బిలాలు.. చెవులు, నోటి ద్వారా కూడా పరిసరాలను ఒక అంచనా వేయగలవు. గబ్బిలాలు చీకటిని, వెలుతురుని గుర్తించగలవు.. కానీ ప్రమాదాలను ఎలా పసిగట్టగలుగుతాయి అనే అనుమానం ఆఫ్ ఇండియా మీకు రావచ్చు. దానికి కూడా గబ్బిలాల సైన్స్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఇండియాలో ఒక రీజనబుల్ రీజన్ ఉంది. గబ్బిలాలు వాటి నోటితో ఎక్కువ శబ్దాలు చేసుకుంటూ ముందుకు వెళ్తాయి. అయితే ఆ శబ్దాల వల్ల వచ్చే ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు.. దారిలో ఏమైనా అడ్డంగా ఉంటే అవి తిరిగి వెనక్కి వెళ్లి గబ్బిలాల చెవిన పడతాయి. ఆ ప్రతిధ్వనుల కారణంగానే అవి ప్రమాదం ఉందని తెలుసుకుని పక్కనుంచి తప్పుకుంటూ వెళ్లిపోతాయి.
అయితే ఈ గబ్బిలాలు రాత్రుళ్ళు మాత్రమే సంచరించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది.. అది రాత్రి పూట సంచరించే జాతికి చెందినది. ఎలుకలు, నక్కలు, గుడ్లగూబల మాదిరే ఈ గబ్బిలాలు కూడా రాత్రుళ్ళు సంచరిస్తాయి. మరొక కారణం ఏంటంటే.. దోమలు, చిమ్మటలు అనబడే కీటకాలు రాత్రుళ్ళు మాత్రమే ఎక్కువగా తిరుగుతాయి. గబ్బిలాలు వీటినే తింటాయి. అందుకే హారం కోసం గబ్బిలాలు రాత్రుళ్లు సంచరిస్తాయి. చీకటిలోనే అవి తమ ఆహారాన్ని సంపాదించుకుంటాయి. మరి తిన్నాక డౌన్ లోడ్ చేయాలిగా. అవి డౌన్ లోడ్ చేసిన రెట్టను అమెరికన్లు గ్వానో అని పిలుస్తారు. గబ్బిలాల రెట్టను ఎరువుగా వాడేవారు. ఇప్పుడంటే టెక్సాస్.. చమురు ఎగుమతి ఎక్కువ చేస్తుంది గానీ ఒకప్పుడు గబ్బిలాల రెట్టను బాగా ఎగుమతి చేసేదట. వినడానికి ఫన్నీగా ఉన్న అప్పట్లో అదొక రొట్ట యాపారం, సారీ రెట్ట యాపారం.
ఇక ఇవి గంటకు 96 కిలోమీటర్ల మైలేజ్ నిస్తాయి. 96 కి.మీ. వేగం లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ఎగురుతాయి. ఇవి 30 ఏళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తాయి. గబ్బిలాలు ఏడాదికి ఒక గబ్బిలం పిల్లని మాత్రమే కనగలుగుతాయి. నీకు వందమంది కనబడుతున్నారేమో.. నాకు మాత్రం ఒక్కడే కనబడుతున్నాడని ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్ చెప్పే డవిలాగ్ ఈ గబ్బిలాలకి బాగా సూటవుతుంది. ఎందుకంటే అవి లక్షల గబ్బిలాల మధ్య కూడా అవి తమ పిల్లలని కేవలం వాసన, ప్రత్యేకమైన శబ్దాల ద్వారా గుర్తుపడతాయి. ఇక ఇవి తలకిందులుగా వేలాడుతూ పడుకుంటాయి. దీనికి కారణం పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్. షట్టర్ కొంచెం తెరుచుకొని పెట్టుకోమ్మా, పారిపోవడానికి ఈజీగా ఉంటుంది అని మహేష్.. సుబ్బరాజుని ఉద్దేశించి చెప్పే డైలాగ్ ఉంటుంది. మహేష్ చెప్పిన డైలాగ్ ని గబ్బిలాలు విన్నాయి కాబోలు. పోకిరి సినిమాలో సుబ్బరాజులా కాకుండా తెలివిగా ఆలోచించాయి.
ఆపద వస్తే రెప్పపాటులో పారిపోవడం కోసం.. రెక్కలను బాగా వెడల్పు చేసుకుని చెట్లకు తలకిందులుగా వేలాడుతూ నిద్రపోతాయి. ఎవరైనా చప్పుడు చేస్తే.. తెరుచుకున్న రెక్కలతో రయ్ మంటూ రాకెట్ లా ఎగిరిపోతాయి. తలకిందులుగా ఎందుకు మామూలుగానే రెక్కలు విస్తరించుకుని పడుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ నిద్రలో రెక్కలు దగ్గరకి ముడుచుకుపోయే అవకాశం ఉంది. అందుకే సపోర్ట్ కోసం చెట్లకు ఆనించి నిద్రపోతాయి. పైగా ఆ రెక్కల్లో తలదాచుకుంటాయి. ఆ రెక్కలను చూసి.. ఎవరో బట్టలు ఆరేసుకున్నారనుకుని పెద్ద జీవులు ఏమీ చేయకుండా వెళ్లిపోతాయని గబ్బిలాల ఫీలింగ్ కావచ్చు. అదన్నమాట విషయం. మరి గబ్బిలాల గురించి మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మీ దగ్గర ఏమైనా సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో అడగండి. సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాము.