ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విసి సజ్జనార్ తన మార్క్ ను చూపిస్తున్నారు. తరచూ బస్టాండులలో తనిఖీ చేయడం.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం లాంటివి చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఎండీ సజ్జనార్. ఈ మద్యనే బస్సులో గుట్కాలు నమిలి ఉమ్మడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బస్టాండ్ లలో వివిధ సేవలకు డబ్బులను యూపీఐ , క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు సేవలను ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తాజాగా సజ్జనార్ హైదరాబాద్ నుండి నల్గొండ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నల్గొండ బస్టాండ్ లో ఉన్న అసౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఎవరికైనా ఏవైనా ఇబ్బందులు ఉంటే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలపాలన్నారు సజ్జనార్. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని ప్రజలను కోరారు.
కరోనా ఆంక్షల ఎత్తివేత తర్వాత ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తర్వాత నల్గొండ బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆర్టీసీ సేవలపై ప్రయాణికుల రివ్యూ తీసుకోవడంతోపాటు ఆర్టీసీ కార్గో సేవలను కూడా పరిశీలించారు. ఇటీవల ఆయన చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.
Today TSRTC MD Sajjanar Sir Inspection In Nalgonda Bus Station
.
.@tsrtcmdoffice @MurthyTrc @tsrtccargonlg @TSRTCHQ @tsrt#nalgonda #thisisnalgonda #nalgondabusstation pic.twitter.com/KPrcC26KD7— This is nalgonda (@ThisisNalgonda) November 6, 2021
