‘న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా 2021’లో భారత్ సమష్టి ప్రదర్శనతో సత్ఫలితాలను అందుకుంది. టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఇండియా.. రెండు టెస్టుల్లో ఒకటి డ్రా, రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ టెస్టు ఓడినా కూడా ఆ టీమ్ బౌలర్ అజాజ్ పటేల్ మాత్రం వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. పది వికెట్ల క్లబ్ లో చేరి యావత్ క్రికెట్ ప్రపంచం నుంచి ప్రశంసలు అందుకున్నాడు అజాజ్ పటేల్. ముంబైలో పుట్టి ముంబై వేదికగా ఆ ఘనత సాధించడం మరింత ఆనందించే విషయం. ఆ సందర్భంగా టీమిండియా ప్లేయర్ల నుంచి మాజీల వరకు అందరూ అతడిని మెచ్చుకున్నారు. అదే సందర్భంలో సెహ్వాగ్ కూడా అజాజ్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. అందుకు అజాజ్ ఓ ఫన్నీ సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
One of the most difficult things to achieve in the game. 10 wickets in an innings. A day to remember for the rest of your life, #AjazPatel . Born in Mumbai, creating history in Mumbai.
Congratulations on the historic achievement. pic.twitter.com/hdOe67COdK— Virender Sehwag (@virendersehwag) December 4, 2021
‘క్రికెట్ లో అత్యంత కఠినమైన విషయం ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లను తీయడం. అజాజ్ పటేల్ కు ఆ రోజు జీవితాంతం గుర్తుండిపోతుంది. ముంబైలో పుట్టి ముంబైలో ఈ ఘనత సాధించాడు. అజాజ్ పటేల్ కు అభినందనలు’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. అందుకు అజాజ్ పటేల్ స్పందించాడు. ‘వీరేంద్ర సెహ్వాగ్ ధన్యవాదాలు. ఈడెన్ పార్క్ మైదానంలో మీకు నెట్ బౌలర్ గా బౌలింగ్ చేసింది నాకు ఇంకా గుర్తింది. నేను వేసిన బంతిని మీరు మైదానం బయటకి కొట్టారు’ అంటూ సెహ్వాగ్ తో తనకున్న ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు అజాజ్ పటేల్.
Thank you @virendersehwag, funny story I still remember you smashing me out of the ground at the outer oval at Eden Park when I came in as a net bowler 😂
— ajaz patel (@AjazP) December 5, 2021
ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్ గా అజాజ్ పటేల్ ఘనత సాధించిన విషయం తెలిసిందే. జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే తర్వాత ఆ ఘనత సాధించిన మూడో బౌలర్ అజాజ్ పటేల్. అనిల్ కుంబ్లే 10 వికెట్లు తీసిన 22 ఏళ్ల తర్వాత అజాజ్ పటేల్ మళ్లీ ఆ ఫీట్ ను సాధించగలిగాడు. సెహ్వాగ్, అజాజ్ పటేల్ సంభాషణపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Game recognises game. 🤜🏻🤛🏻#PlayBold #TeamIndia #INDvNZ pic.twitter.com/YLltTg46xO
— Royal Challengers Bangalore (@RCBTweets) December 6, 2021