డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ గెలుస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ ఫైనల్లో భారత్ ఓటమి దాదాపు ఖాయమైనట్టే. కానీ సునీల్ గవాస్కర్ మాత్రం టీమిండియాకు అండగా నిలిచాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. మొదట బౌలింగ్ లో విఫలమైన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా చేతులెత్తేసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇంకా 318 పరుగులు వెనకబడిన టీమిండియాకు ఈ మ్యాచులో గెలవడం అంటే దాదాపు అసాధ్యం అనే చెప్పుకోవాలి. ఇంగ్లాండ్ లాంటి పిచ్ ల మీద ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లని తట్టుకుని ఈ మ్యాచులో నిలబడడం కష్టం అనే ప్రతిపాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే చాలా మంది భారత అభిమానులు ఈ మ్యాచ్ మీద ఆశలు వదిలేసుకోగా.. ఆస్ట్రేలియా అప్పుడే సంబరాలోకి వెళ్ళిపోయింది. ఈ సమయంలో టీమిండియాకు ఇంకా గెలిచే అవకాశముందని దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ గెలుస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ ఫైనల్లో భారత్ ఓటమి దాదాపు ఖాయమైనట్టే. కానీ సునీల్ గవాస్కర్ మాత్రం టీమిండియాకు అండగా నిలిచాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో గెలిచేందుకు ఇప్పటికీ అవకాశం ఉందని చెప్పాడు. మొదట ఫాల్ ఆన్ స్కోరు దాటేసేలా టార్గెట్ పెట్టుకోవాలని సూచించాడు. ఆఖరి రోజు రవీంద్ర జడేజా తన ప్రతాపం చూపిస్తాడని వెల్లడించాడు. ఈ సందర్భంగా 2001 లో కోల్ కత్తా లో జరిగిన టెస్టుని గుర్తు చేసాడు. ఆస్ట్రేలియాతో జరిగిన కోల్ కత్తా టెస్టులో ఫాలో ఆన్ ఆడుతూ టీమిండియా సంచలన విజయాన్ని విజయాన్ని సొంతం చేసుకుంది.
గవాస్కర్ మాట్లాడుతూ “టీమ్ఇండియాకు ప్రస్తుతం ఒక భారీ భాగస్వామ్యం అవసరం. 2001లో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఏం చేశారో ఆస్ట్రేలియాకు తెలుసు. ఫాలో ఆన్ ఆడుతూ.. ఈ మ్యాచ్ భారత్ గెలిచినా తీరు అద్భుతం. ఆసీస్ ని బ్యాటింగుకు దించి ఆఖరి రోజు ఆలౌట్ చేశారు. ఆ తర్వాత సిరీసులో ఆఖరి టెస్టు గెలిచారు. అందుకే టీమ్ఇండియాతో ఆసీస్ ఫాలో ఆన్ ఆడిస్తుందని అనుకోను. ఎందుకంటే వారలా చేస్తే భారత్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తుంది. వాళ్లకు ఆ సామర్థ్యం ఉంది. హిట్ మ్యాన్ కొన్ని పొరపాట్లు చేసాడు. ఇకచివరి రోజు బంతి తిరిగితే జడేజా మ్యాజిక్ చేస్తాడని తెలిపాడు. అయితే ముందుగా 269 పరుగుల స్కోర్ ని భారత్ దాటాలి. అని గవాస్కర్ ఈ సందర్భంగా తెలియజేశాడు. మరి గవాస్కర్ చెప్పినట్లుగా ఈ మ్యాచులో టీమిండియా విజయం సాధిస్తుందేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.