ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటుతో మరణించారు. 52 ఏళ్ల వార్న్ థాయ్‌లాండ్‌లో కన్నుమూశారు. తన స్పిన్ బౌలింగ్‌తో క్రికెట్ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన వార్న్ ప్రస్తుతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వార్న్ మృతితో క్రీడా ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా ఆస్ట్రేలియా తరపున 145 టెస్టులు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు సాధించారు. ఇందులో ఐదు వికెట్ల ఘనతను 37 సార్లు, 10 వికెట్ల ఘనతను 10 సార్లు అందుకున్నారు. 194 వన్డేల్లో 293 వికెట్లు తీశారు.
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన షేన్ వార్న్ అరంగేట్రం సీజన్‌లోనే కెప్టెన్‌గా జట్టుకు టైటిల్ అందించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జట్టు మరో టైటిల్ గెలవలేదు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కామెంటేటర్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన షేన్ వార్న్.. క్రికెట్ మ్యాచ్‌లపై ఎప్పటికప్పుడూ తన అభిప్రాయాలను పంచుకుంటూ అభిమానులతో టచ్‌లోనే ఉన్నాడు. ఇటీవలే ఇంగ్లండ్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు కూడా వార్న్ సిద్దంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాగా వార్న్ మృతిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Shocking
RIP LEGEND#Shane #Legend #shanewarn https://t.co/ATLM2zgijY— Ayush Agrawal 🕊️ (@ayushagrawal55) March 4, 2022
