కెప్టెన్సీ కొందరి బలం అయితే మరికొందరికి బలహీనంగా మారుతోంది. కొన్ని సార్లు అతని, జట్టు మొత్తానికి కూడా నష్టం చేస్తుంది. క్రికెట్లో జట్టుకు నాయకత్వం వహించడం అంతే ఈజీ టాస్క్ కాదు. కొన్ని సార్లు కెప్టెన్సీ భారంతో వ్యక్తిగతంగా దారుణంగా విఫలం అయి కెరీర్ మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఐపీఎల్ 2022తో ఇలాంటి పరిస్థితి ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఎదుర్కొంటున్నారు. వాళ్లే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆరంభంలో కెప్టెన్‌గా వ్యవహరించిన రవీంద్ర జడేజా. ఈ ఇద్దరికీ ఐపీఎల్ 2022లో టీమ్స్‌ని ముందుండి నడిపించే అవకాశం వచ్చింది. మొదటి సారి ఒక మెగా ఈవెంట్లో, స్టార్లతో నిండి ఉన్న టీమ్స్‌ను నడిపించే ఒత్తిడిలో ఇద్దరు చిత్తయ్యారు. కెప్టెన్సీ భారంతో ఇద్దరి వ్యక్తిగత ఆట దారుణంగా దెబ్బతింది. జట్ల ప్రదర్శన కూడా నిరాశపర్చింది. దీంతో ఈ ఇద్దరి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ.. కెప్టెన్ల ఎంపిక విషయంలో ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు కొంచెం బుర్రపెట్టి ఆలోచించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘ఎప్పుడూ కెప్టెన్లుగా వ్యవహరించని ప్లేయర్లను కెప్టెన్లుగా నియమించే ముందు ఫ్రాంచైజీలు చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఇది మయాంక్‌ను అగౌరవపరచడం కాదు. ఎందుకంటే నేను అతన్ని బాగా ఇష్టపడతాను. అతను క్రికెట్ ఎలా ఆడతాడో, అతను ఎంత మంచి షాట్లు కొట్టగలడో నాకు తెలుసు. ప్లేయర్‌గా అతను బ్రహ్మాండంగా ఆడగలడు. కానీ అతన్ని కెప్టెన్‌గా చేయడంతో భారం పెరిగిపోయింది. కెప్టెన్సీ వల్ల అతను కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా అతని ఆట దెబ్బతింది. తద్వారా అతను భారత జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. సెలెక్టర్లు ప్రస్తుత ఫామ్‌ను బట్టే ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారు. కాబట్టి ఓ ప్లేయర్‌ను కెప్టెన్సీ ఇచ్చి అతని ఫామ్ దెబ్బతినేలా చూడకుండా ఫ్రాంచైజీలు వ్యవహరించాలి’ అని పేర్కొన్నారు.
ఈ సీజన్లో మయాంక్ అగర్వాల్ 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 16.33 సగటుతో 196 పరుగులు మాత్రమే చేశాడు. అందులో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ. ఈ గణాంకాలే చెబుతున్నాయి. మయాంక్ బ్యాటింగ్‌లో ఎంత దారుణంగా విఫలం అయ్యాడో. గత ఏడాది ఐపీఎల్లో మయాంక్ 40.09 సగటుతో 441 పరుగులు సాధించాడు. అందులో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో 99 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ భారంతో మయాంక్ అగర్వాల్ వ్యక్తి గత ప్రదర్శన దారుణంగా దెబ్బతింది. దీంతో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు అతను టీమిండియా స్థానం దక్కించుకోలేకపోయాడు. పైగా మయాంక్ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నా.. అతనికి పూర్తి స్వేచ్ఛలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కోచ్ అనిల్ కుంబ్లే మయాంక్‌ను ఎక్కువగా కంట్రోల్ చేశాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో పంజాబ్ కెప్టెన్సీ మయాంక్ కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది. వచ్చే సీజన్‌కు మయాంక్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తారా? లేదా? అనేది కూడా అనుమానమే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rishabh Pant: రిషభ్ పంత్‌ను దారుణంగా మోసం చేసిన క్రికెటర్! అదుపులోకి తీసుకున్న పోలీసులు
IPL 2022: Captaincy could have cost him his place in the Indian side: Ravi Shastri 💥👩👩💥 https://t.co/Bn8WEE4jBB
— Lael Eilerman (@EilermanLael) May 24, 2022
