ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో అందరినోట ఒకటే పేరు వినిపిస్తోంది. అదే న్యూజిలాండ్ ప్లేయర్ అజాజ్ పటేల్. ముంబయి టెస్టులో భారత్ ను ఆలౌట్ చేసి అతను సాధించిన ఫీట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. మొత్తం టీమిండియా స్వ్కాడ్ ను పెవిలియన్ చేర్చి రికార్డులు నమోదు చేశాడు. టెస్టుల్లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్ గా అజాజ్ పటేల్ రికార్డులకెక్కాడు. ఇప్పుడు అందరూ అసలు అజాజ్ పటేల్ ఎవరు? అతను నిజంగానే భారత సంతతా? అని వెతుకులాట మొదలు పెట్టారు.
ALL 10 WICKETS for AJAZ PATEL in Mumbai!
Follow the day live in NZ on @skysportnz & @SENZ_Radio. Live scoring | https://t.co/tKeqyLOL9D #INDvNZ pic.twitter.com/5TiPK2syhK— BLACKCAPS (@BLACKCAPS) December 4, 2021
అవును, అజాజ్ పటేల్ నిజంగానే భారత సంతతి. అతని పూర్తి పేరు అజాజ్ యూనస్ పటేల్. అతను పుట్టింది ముంబయిలోనే. 1988 అక్టోబరు 21న ముంబయిలో జన్మించాడు అజాజ్ పటేల్. ఇప్పుడు అదే గడ్డపై టీమిండియాపై రికార్డు సృష్టించాడు. అజాజ్ కు ఎనిమిది సంవత్సరాల వయసులో అతని కుటుంబం న్యూజిలాండ్ వెళ్లిపోయింది. మొదటి టెస్టులో బ్యాట్ తో వికెట్లుగా అడ్డుగా నిలిచి న్యూజిలాండ్ ను ఓటమి తీరాల నుంచి గట్టెక్కెచి.. డ్రాగా ముగిసేలా చేసింది కూడా అజాజ్ పటేలే. ఇప్పుడు బాల్ తో చెలరేగిపోయాడు. ఉపఖండ పిచ్ లపై సరైన అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఇద్దరు భారత సంతతి ప్లేయర్లను టెస్టు టీమ్ లో జత చేసిన న్యూజిలాండ్ మాస్టర్ ప్లాన్ నిజంగానే సత్ఫలితాలు ఇస్తోంది.
Incredible achievement as Ajaz Patel picks up all 10 wickets in the 1st innings of the 2nd Test.
He becomes the third bowler in the history of Test cricket to achieve this feat.#INDvNZ @Paytm pic.twitter.com/5iOsMVEuWq
— BCCI (@BCCI) December 4, 2021
2018లో న్యూజిలాండ్ తరఫున పాకిస్తాన్ పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు అజాజ్ పటేల్. తొలి టెస్టులోనే రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 13 ఇన్నింగ్స్ లో మూడుసార్లు 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. తాజాగా భారత్ పై 10 వికెట్లు తీసి రికార్డుల కెక్కాడు. ఇప్పటివరకు టెస్టుల్లో అజాజ్ పటేల్ 27.21 సగటుతో 39 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోనూ అతని సత్తా చాటాడు. 2012లో న్యూజిలాండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు అజాజ్ పటేల్. 68 మ్యాచ్ లలో 251 వికెట్లు తీసిన ఘనత అతని సొంతం. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 18సార్లు ఐదు వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్. 979 పరుగులతో రన్స్ పరంగానూ అజాజ్ కు మంచి రికార్డే ఉంది. అజాజ్ పటేల్ సాధించిన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Welcome to the club #AjazPatel #Perfect10 Well bowled! A special effort to achieve it on Day1 & 2 of a test match. #INDvzNZ
— Anil Kumble (@anilkumble1074) December 4, 2021
A new entrant into the 🔟 / 🔟 club today 👏
— ESPNcricinfo (@ESPNcricinfo) December 4, 2021