ఇండియాలో ఎక్కువ క్రేజ్ ఉన్న స్పోర్ట్స్ ఏదంటే.. ఎవరైనా ఠక్కున చెప్పే పేరు క్రికెట్. ఈ ఆట మన దేశంలో ఒక మతంలా మారిపోయి కొన్ని దశాబ్దాలు అవుతోంది. అందుకే క్రికెట్‌ను కెరీర్‌గా స్వీకరించి.. దేశానికి ఆడాలని కలలు కనే యువకులు కోట్లలో ఉంటారు. కానీ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం అంత ఈజీ కాదు. భీకరమైన పోటీ ఉంటుంది. ఎంతో ఎక్స్‌ట్రీమ్ టాలెంట్ ఉంటే తప్పా టీమిండియాలో, ఐపీఎల్ జట్లలో చోటు దక్కదు. దాని కోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. గొప్ప క్రికెట్ అవ్వాలనే కలను నిజం చేసుకోవాలనే ఆశయాన్ని సాధించడానికి మన సంతోషాలు, సరదాలు త్యాగం చేయాల్సి ఉంటుంది.
సరదాలు, సంతోషాలకు మించి.. ఒక క్రికెట్ ఏకంగా కుటుంబానికే దూరంగా ఉన్నాడు. తన ఆశయాన్ని సాధించే వరకు ఇంటి ముఖం చూడనని ప్రతిజ్ఞ పూనాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తొమ్మిదేళ్లు ఇంటికి, కన్నవారికి దూరమయ్యాడు. చివరికి శనివారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌తో తన జీవితాశయం నేరవేర్చుకున్నాడు. ఐపీఎల్‌లో అరంగేట్రం మ్యాచ్‌తోనే తన ముద్ర వేశాడు. అతనే.. ముంబై ఇండియన్స్ యువ సంచలనం కుమార్ కార్తీకేయ సింగ్.. అదే కేకే సింగ్. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఈ సీజన్‌లో తొలి గెలుపు నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన కేకే సింగ్.. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి సంజూ శాంసన్ వికెట్ కూడా పడగొట్టాడు. తన అద్భుత ప్రదర్శనతో పాటు ముంబై మ్యాచ్ గెలవడంతో కేకే సింగ్ గురించి క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. దీంతో తన 9 ఏళ్ల కఠిన దీక్షకు తెరదించాలని కేకే సింగ్ భావిస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత.. తన ఇంటికి వెళ్లి అమ్మను కలుస్తానని అంటున్నాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించిన తర్వాతే తన ముఖం అమ్మకు చూపిస్తానని చెప్పిన మధ్యప్రదేశ్‌కు చెందిన కేకే సింగ్. ఇప్పుడు గర్వంగా ఇంటికి వెళ్తానని అంటున్నాడు. ముంబై యంగ్ ప్లేయర్ అర్షద్ ఖాన్ గాయపడటంతో కేకే సింగ్‌కు ముంబై జట్టులో చోటు దక్కింది. మరి ఈ యువ క్రికెటర్ ఇన్స్‌పైరింగ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: GT vs RCB: బౌలర్ తప్పు లేకుండానే నో బాల్ ఇచ్చిన థర్డ్ అంపైర్!
IPL 2022: Arshad Khan out of Mumbai Indians due to injury, Kumar Karthikeya got a place in the team https://t.co/ZJTqe0wGoX
— DTN (पैनी नजर, बेबाक खबर) (@DTNmedia) April 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.