ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అత్యుత్తమ వికెట్ కీపర్లుగా నిలిచారు. రెప్పపాటులో స్టంపింగ్లు, కళ్లు చెదిరే క్యాచ్‌లతో ఎన్నో అద్భుత విన్యాసాలు చేశారీ లెజెండ్స్. ప్రస్తుత క్రికెట్‌లో కూడా వీళ్లని అందుకున్న వాళ్లు లేరు. కానీ.. ఐపీఎల్‌లో కోల్‌కోత్తా నైట్ రైడర్స్ జట్టుకు ఆడుతున్న ఇండియన్ యువ క్రికెటర్ షెల్డన్ జాక్సన్ బుధవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఒక అద్భుతమైన క్యాచ్ పట్టి సీనియర్ క్రికెట్ ఫ్యాన్స్‌కు గిల్‌క్రిస్ట్, ధోనిని గుర్తొచ్చేలా చేశాడు. జాక్సన్ పట్టిన ఆ సూపర్ వన్ హ్యాండెడ్ క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 129 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ ఆదుకున్నాడు. మొదట డేవిడ్ విల్లీతో కలిసి 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రూథర్‌ఫోర్డు.. షాబాజ్ అహ్మద్‌తో కలిసి 39పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. అయితే రూథర్‌ఫర్డ్‌ను కేకేఆర్ వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ పంపాడు.18వ ఓవర్లో 107-5తో ఆర్సీబీ పటిష్ట స్థితిలో ఉండడంతో ఆ జట్టు విజయం ఖాయమనిపించింది. కానీ టీమ్ సౌథీ వేసిన 18వ ఓవర్ రెండో బంతిని రూథర్‌ఫర్డ్ వెనక్కి ఆడే ప్రయత్నం చేయగా వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ డైవ్ చేసి మరి ఆ బంతిని ఒంటిచేత్తో అందుకున్నాడు. దీంతో రూథర్‌ఫర్డ్ 28 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. సూపర్ క్యాచ్‌తో అదరగొట్టిన జాక్సన్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మ్యాచ్ ఓడినా కూడా జాక్సన్ కీపింగ్‌పై కేకేఆర్ మేనేజ్‌మెంట్ కూడా సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ షెల్డన్ జాక్సన్ వన్ హ్యాండెడ్ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ.. ఈ బ్రాండ్ నేమ్ విలువెంతో తెలుసా..?
@ShelJackson27 what a catch 👏 @msdhoni @KKRiders #whatacatch pic.twitter.com/QLbSg33ZwS
— sid (@siddheshnate) March 30, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.