ఐపీఎల్ 2022లో సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలిచినా.. లక్నోకు ఆడిన ఒక కుర్రాడి పేరు మాత్రం మారుమోగుతోంది. అతని పేరే ఆయుష్ బదోని. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ చేసి అందరిని ఆకర్షించాడు. పైగా కేఎల్ రాహుల్, డికాక్ లాంటి అంతర్జాతీయ స్టార్లు వికెట్లు పారేసుకున్న చోట ఏమాత్రం బెరుకు లేకుండా.. షమీ, రషీద్ ఖాన్ లాంటి దిగ్గజాలను ధీటుగా ఎదుర్కొన్నాడు. వారి బౌలింగ్‌లో భారీ సిక్సులు బాది ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. పైగా ఫ్యాన్స్ ఇండియన్ బేబీ ఏబీడీ, మిస్టర్ యంగ్ 360 డిగ్రీ ప్లేయర్‌గా పిలుస్తున్నారు.
అలాగే మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆయుష్ బదోనిని ఉద్ధేశిస్తూ.. మాకో బేబీ ఏబీ దొరికాడని ప్రకటించడంతో ఇంతకీ ఎవరీ బదోని అని క్రికెట్ అభిమానులు ఆరా తీయడం మొదలెట్టారు. తొలి ఐదు ఓవర్లలోనే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన లక్నో జట్టుకు ఆరో స్థానంలో గ్రౌండ్‌లోకి వచ్చిన ఆయుష్ బదొనీ వరల్డ్ టాప్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. 14 ఓవర్ల పాటు నిలకడగా ఆడిన బదొనీ.. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వేసిన 15వ ఓవర్‌లో 6, 4, 4 వరుస బౌండరీలతో విరుచుకుపడి 50 పరుగులు పూర్తి చేశాడు. మొత్తం 41 బంతులు ఆడిన బడోనీ.. మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 54 పరుగులు చేశాడు. ఇప్పుడు భారత సెలక్టర్లంతా జరగబోయే ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బదొనీ ఎలా ఆడతాడని చూస్తున్నారు.
ఢిల్లీకి చెందిన ఆయుష్ బదొనీని.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.20 లక్షలకు దక్కించుకుంది. అండర్ 19 క్రికెట్‌లో ఆడిన ఈ 22 ఏళ్ల ఆటగాడు.. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఢిల్లీ నుంచి అండర్ 19 జట్టులోకి వెళ్లిన బదొనీ తనకంటు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అండర్ 19 విభాగంలో.. శ్రీలంక మీద జరిగిన యూత్ టెస్ట్‌లో 185 పరుగులు చేసి.. ఆ తర్వాత ఆసియా కప్‌లో కేవలం 28 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. అండర్ 19 క్రికెట్ ఆడిన తర్వాత మూడేళ్లు సైలెంట్ అయిన బదొనీ.. నిన్న జరిగిన మ్యాచ్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.
బదోని తన ఐపీఎల్ ఎంట్రీ గురించి చెబుతూ.. “నన్ను గౌతమ్ భయ్యానే తీసుకొచ్చాడు. మ్యాచ్ పరిస్థితిని బట్టి నువ్వేం ఆడొద్దు.. నీ ఆట నువ్వు ఆడుకో చాలు అని చెప్పాడు. నీ న్యాచురల్ గేమ్ ఎలా ఆడతావో ఐపీఎల్‌లో కూడా అలానే ఆడని గౌతమ్ భయ్యా అన్నాడు.. అందుకే నిన్న మ్యాచ్‌లో నాలానే ఆడాను. ఐపీఎల్‌లో రావడానికి గత రెండు, మూడు ఏళ్లుగా వేలంలో నమోదు చేసుకున్నా.. కానీ ఎవరూ కొనుగోలు చేయలేదు. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీకి రుణపడి ఉంటా.. ” అని ఆయుష్ బదొనీ తన ఆనందాన్ని పంచుకున్నాడు. మరి ఈ యువ క్రికెటర్ ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: RCB కి దొరికిన మరో ABD..! కోహ్లీతో అదే బంధం!
KL Rahul about Ayush Badoni – He is the baby AB for us.#GTvLSG #IPL2022 #CricketTwitter #IPL #AyushBadoni pic.twitter.com/WDkrx84dLS
— Cricbuzz (@cricbuzz) March 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.